బంగారు ఆభరణాలు స్వాధీనం

Thu,March 21, 2019 12:31 AM

ఆర్మూర్ రూరల్ : మామిడిపల్లిలో చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనె ల 18న మామిడిపల్లిలో తాళం వేసిన ఇంట్లో తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేసి బుధవారం దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కి తరలించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె రాములు, సీఐ రాఘవేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి. పట్టణంలోని మామిడిపల్లికి చెందిన పద్మ 18వ తేదీన వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామానికి వెళ్లారు. దీన్ని గమనించిన కాలనీ వాసి షేక్ బర్కత్ లేబర్ పనిచేసుకొని జీవించే వ్యక్తి ఇంట్లో చొరబడి 23.3 తులాల బంగారం, 9 తు లాల వెండి ఆభరణాలు దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 24గంటల్లో దొంగలను పట్టుకొని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అనంతరం ఏసీపీ అందె రాములు సీఐ రాఘవేంధర్ టీంను అభినందించారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles