ఇందూరు వేదికగా గులాబీ గర్జన

Wed,March 20, 2019 01:32 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇందూరు గడ్డపై సీఎం కేసీఆర్ సింహగర్జన పూరించారు. యావత్ జాతిని ఆకర్షించేలా భారీ బహిరంగ సభా వేదికగా తన ప్రసంగం ద్వారా మరోమారు తన విశ్వరూపాన్ని చూపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఈ సభకు వచ్చిన అశేష జనవాహనిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది.. ఆలోచింపజేసింది. ఈ వేదికగా ఆయన జిల్లా గురించి తన పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉద్యమానికి వెన్నంటి ఉన్న జిల్లాగా ఇక్కడి ప్రజలపై తన మక్కువను చాటుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తానే సారథ్యం వహిస్తానన్న కీలక నిర్ణయం తీసుకున్నది ఇక్కడి నుంచేనని ఆయన చెప్పారు. పోచంపాడ్ ప్రాజెకు మీద 1996లో ప్రాజెక్టు దుస్థితి చూసి అప్పటి స్నేహితులతో తాను తెలంగాణ ఉద్యమం రావాల్సిందేనని, ఉద్యమానికి తానే సారథ్యం వహించబోతున్నానని ప్రకటించిన సందర్భాన్ని ఈ వేదికగా గుర్తు చేసుకున్నారు. పార్టీ ఏర్పడిన తర్వాత తొలి సమావేశాన్ని ఖలీల్‌వాడీలో ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని తలచుకున్నారు.

ఆనాటి సంగతులను పంచుకున్నారు. తెలంగాణ తెగించి కొట్లాడి తెచ్చిన విధానాన్ని ఇందూరు వేదికగా నాటి సంగతులను ప్రజల ముందుంచారు. తొలి జడ్పీ పీఠం పార్టీకి కైవసం చేసి ఇక్కడ ప్రజల ఉద్యమానికి ఆక్సిజన్‌గా నిలిచారని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని రెపరెపలాడించి తనకు వెయ్యినుగుల బలాన్నిచ్చి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఈ జిల్లా ఎంతో చైతన్యవంతమైన జిల్లా అని, ఒకప్పుడు ధనవంతమైన జిల్లాగా పేరుగాంచిందన్నారు. రాష్ట్రంలోనే ఇందూరుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశంలో నడుస్తున్న రాజకీయాలపై ఈ వేదికగా చర్చ జరగాలన్నారు. యావత్ దేశ ప్రజలకు కూడా ఈ చర్చలో పాల్గొని ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలను ప్రక్షాళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాకు పూర్వవైభవం తీసుకువస్తానని చెప్పిన ఆయన.. ఆగస్టులో కాళేశ్వరం పూర్తవుతుందని, ఒక్కసారి స్విచ్ ఆన్ చేస్తే.. ఇక నిజాంసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు ఎప్పుడు ఎండిపోవని అన్నారు. కొత్త మండలాల ప్రకటన కూడా ఇదే వేదికగా చేశారు సీఎం కేసీఆర్. ఆర్మూర్‌లోని ఆలూర్, డొంకేశ్వర్‌ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తామన్నారు.

బోధన్‌లోని సాలూరను కూడా కొత్త మండలంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎర్రజొన్న, పసుపు రైతులకు కేసీఆర్ భరోసా నింపారు. కొండంత ధైర్యాన్నిచ్చారు. ఎర్రజొన్న రైతులకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా కాల్పులు జరిపితే .. తాము బకాయిలు చెల్లించిన సందర్భాన్ని గుర్తుచేశారు. ఎవరో ఆగమాగం చేస్తే మీరు ఆగం కావొద్దని ఆయన ఈ వేదికగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించవన్నారు. ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి తదితరులు మాత్రమే మీకు తోడుగా ఉంటారని కేసీఆర్ అన్నారు. తప్పకుండా తాను ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తానన్నారు. ఇది ఎన్నికల వేళ కావడంతో ఇప్పుడు ప్రకటన చేస్తే బాగుండదని చెప్పిన ఆయన.. ఎన్నికల తర్వాత ఎర్రజొన్న రైతులకు న్యాయం చేకూరేలా ప్రకటన ఉంటుందని పరోక్షంగా చెప్పడంతో వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. పసుపు రైతుల గురించి కూడా సీఎం కేసీఆర్ మాట్లాడి వారి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చెప్పారు.

ప్రస్తుతం పట్టణాల్లో దొరికే పసుపులో రంపపు పొడి కలిపి కల్తీ చేస్తున్నారని, ఇకపై అలాంటిది ఉండదన్నారు. ఇక్కడి పసుపును మహిళా సంఘాలతో కొనిపించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా తెలంగాణ బ్రాండ్ కింద దీన్ని దేశ మొత్తం ఎగుమతి చేస్తామని తెలిపారు. ఇక గిట్టుబాటు ధర సమస్యే ఉండదని, దీనికి కొంత సమయం ఇవ్వాల్సిందిగా ఆయన పసుపు రైతులను కోరారు. క్రాప్ కాలనీలపైనే తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు. ఇక నుంచి రైతు సమన్వయ సమితులు పూర్తి స్థాయిలో కార్యరంగంలోకి దిగనున్నాయని, క్రాప్‌కాలనీ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రణాళికలు సిద్ధ్దం అవుతున్నాయని తెలిపారు.బ ఎర్రజొన్న రైతులకు న్యాయం చేసే క్రమంలో ఎంపీ కవిత, మంత్రి వేములతో మాట్లాడి త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. దీంతో సభలో హర్షద్వానాలు మిన్నంటాయి.

సభ సక్సెస్‌తో నయా జోష్..
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందూరులో జరిగిన సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. దీంతో ఇందూరు గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపు రెండు లక్షల మంది వరకు తరలివచ్చారు. అశేషంగా వచ్చిన జనానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వేదికగా ఆయన మరోమారు తన విశ్వరూపాన్ని చూపారు. ఇందూరు చైతన్యవంతమైన జిల్లా అని, ఇక్కడ నుంచి మాట్లాడే మాటలు అంతటా చర్చ జరగాలన్నారు. పార్టీ ఆవివర్భావంలో తెలంగాణ ఆత్మగౌవరానికి ప్రతీకగా నిలిచి ఉద్యమానికి ఊతమిచ్చిన జిల్లా అని అన్నారు. 2001లో జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరువేసి తమ చైతన్యాన్ని చాటుకున్నారని అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా సమైక్యపాలనలో జిల్లా పూర్తిగా ధ్వంసమైందన్నారు. నిజాంసాగర్, ఎస్సారెస్పీ ఎండిపోయి ధనిక జిల్లాగా ఉన్న ఇందూరు.. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుపోయిందన్నారు. అందుకే చాలా మంది యువకులు గల్ఫ్‌బాట పట్టారని తెలిపారు. దీనికి పూర్వవైభవం తీసుకువస్తామని సీఎం అన్నారు.

ప్రతీ రైతు ఖాతాలో రూ. 5 లక్షలు
ధర్మాబాద్‌లో 40గ్రామాల సర్పంచులు వచ్చి తమని తెలంగాణలో విలీనం చేయాలని కోరడం ఇక్కడి పాలనకు నిదర్శనమని కేసీఆర్ అన్నారు. ప్రత్యేకంగా ఈ సభకు వచ్చిన వారు కేసీఆర్ మాట్లాడేటప్పుడు తమ చేతులు పైకెత్తి అభివాదం తెలిపారు. బీడీకార్మికుల సమస్యలను గురించి మాట్లాడుతూ.. దేశవ్యాప్తగా 16 రాష్ర్టాల్లో 52.32 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, తెలంగాణలో 4.5 లక్షల మంది జనం ఉన్నారని వారికి, జీవనభృతి కింద రూ. 1000 ఇచ్చి ఆదుకున్నది దేశంలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని అన్నారు. బీడీ కార్మికులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని విమర్శించారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ అవసరమని చెబుతన్నామని, త్వరలో బీడీకార్మికులకు రూ. 2వేల భృతిని ఇవ్వబోతున్నామని సీఎం అన్నారు. పీఎఫ్ కటాఫ్‌ను కూడా తొలగించేసి .. ప్రతీ ఒక్కరికీ బీడీ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలపగానే సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డిలు డిమాండ్ చేసి మరీ వెయ్యికోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవం పనులు చేపించుకుంటున్నారని, దీని ద్వారా ఇక ఎప్పటికీ పోచంపాడ్ ప్రాజెక్టు ఎండిపోదన్నారు. ఆగస్టులో కాశేళ్వరం పూర్తవుతుందని, ఇక ఒక్కసారి స్విచ్‌ఆన్ చేస్తే ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులు ఎప్పటికీ ఎండవన్నారు. ఏడెనిమిదేండ్లలో రైతుల బాకీలన్నీ తీర్చేలా.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 5 లక్షల సిలక్ అమౌంట్ ఉండేలా చేస్తామని అన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles