కవితపై పోటీకి భయపడుతున్నారు

Wed,March 20, 2019 01:29 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మహిళలు ప్రేమతో, అభిమానంతో బతుకమ్మగా పిలుచుకునే ఎంపీ కవిత పై పోటీ చేయడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు పోటీనిచ్చే వారే లేరని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి బంపర్ మెజార్టీని ప్రజలు అందించడం ఖాయమన్నారు. నిజామాబాద్ జిల్లా అంటే తెలంగాణ అడ్డ అన్నారు. తెలంగాణ అడ్డలో గులాబీ జెండా మరోసారి రెపరెపలాడడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ ప్రారంభం నాటి నుంచి కేసీఆర్‌కు నిజామాబాద్ జిల్లా అండగా నిలుస్తూ వస్తుందన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన గొప్ప ప్రజలు ఇక్కడి వారని అన్నారు. ఎంపీ కవితకన్నా ముందు ఎంపీగా పనిచేసిన వ్యక్తి అభివృద్ధి కోసం మంజూరైన నిధులను కూడా ఖర్చు చేయలేని విషయాన్ని ప్రజలు మరిచి పోలేదన్నారు. 2009లో ఎర్రజొన్నల పక్షాన తాను ఆమరణ దీక్ష చేసిన సమయంలో కేసీఆర్ వచ్చి ఎర్రజొన్న రైతుల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు ఎర్రజొన్న రైతుల బకాయిలు చెల్లించామన్నారు. రూ. 2300 మద్దతు ధరతో రూ. 139 కోట్లు వెచ్చించి ఎర్రజొన్నను కొనుగోలు చేశామని గుర్తు చేశారు. నిజామాబాద్ - ఆర్మూర్ ఫోర్‌వే రోడ్డు, రైల్వేలైన్, పంచగుడి బ్రిడ్జి ఎంపీ కవిత కృషితోనే సాధ్యమైందన్నారు. కేంద్ర నుంచి జిల్లాకు నిధులు సాధించుకోవాలంటే ఎంపీ కవితను ఐదు లక్షల మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles