పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

Wed,March 20, 2019 01:29 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సంయుక్త ఎన్నికల ముఖ్య అధికారి ఆమ్రాపాలి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఎంప్లాయి డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) జారీ చేయడానికి కొత్తగా రూపొందించిన పోస్టల్ బ్యాలెట్ సాఫ్ట్‌వేర్ పనితీరు, సువిధ సాఫ్ట్‌వేర్ ద్వారా అనుమతులు ఇచ్చే విధానంపై వివరించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దొత్రే, నోడల్ అధికారి నాగేంద్రయ్య, రఘునాథ్, కలెక్టరేట్ ఏవో పద్మారావు, ఎన్నికల సిబ్బంది, సాయి భుజంగరావు, శ్రీనివాస్, నర్సింహారావు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles