ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Wed,March 20, 2019 01:29 AM

ఇందూరు: నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాకారుడు సాయిచంద్ బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. కారు మనదే సర్కారు మనదే..గల్లీ మనదే.. ఢిల్లీ మనదే..,ఇందూరు గడ్డ మీద గులాబీ జెండా పాటకు కార్యకర్తలతో సహా వయసుతో నిమిత్తం లేకుండా వృద్ధులు సైతం నృత్యాలు చేశారు. ఆ సమయంలో సభలో పాల్గొన్న వారంతా ఒక్క సారిగా కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పాడిన రైతుబంధుపై పాటకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఎకరానికి రూ.5వేల పెట్టుబడి సాయంతో పండగలా వ్యవసాయం మారిందని పాడిన పాటకు.. రైతులు, కార్యకర్తలు, నాయకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కల్వకుంట్ల కవిత గెలుపు ఆవశ్యకతను, కేసీఆర్ పాలనలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ పాడిన పాట ఆకట్టుకుంది. మొత్తంగా ఇందూరులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

32
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles