జనం జనం.. ప్రభంజనం

Wed,March 20, 2019 01:29 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌లో కేసీఆర్ సభ అంచనాకు మించి విజయవంతమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు నెలల క్రితం ఇందూరులోనే ఇదే మైదానంలో రెండు లక్షల మందితో కేసీఆర్ సభ హోరెత్తింది. ఈ సభ జరిగిన తర్వాత అనతికాలంలోనే మళ్లీ నిర్వహించిన సీఎం సభ మళ్లీ రెండు లక్షల మందితో విజయవంతం కావడం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్‌ను రెట్టింపులు చేసింది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నలుమూలల నుంచి జనం ప్రభంజనంలా తరలివచ్చారు. మధ్యాహ్ననికే జిల్లా కేంద్రం, సభా మైదాన ప్రాంతం గులాబీ శ్రేణులతో కళకళలాడింది. పార్లమెంటు నియోజకవర్గం నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రహదారులన్నీ గులాబీజెండాల కట్టిన వాహనాలతో ఉదయం నుంచే కనిపించాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా రెండు లక్షల పై చిలుకు జనం సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు.

మైదానమంతా సీఎం రాకకు రెండు గంటలు ముందే నిండిపోయింది. సభా మైదానికి వచ్చే దారులు సైతం జనాలతో కిటకిటలాడాయి. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వింటూ సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ ప్రజలు సీఎం సభ పట్ల తమ ఉత్సాహాన్ని చాటారు. రైతులు, యువకులు సీఎం ప్రసంగం ఆసాంతం ఈలలతో, చప్పట్లతో మార్మోగించారు. కళాకారుడు సాయిచంద్ పాడిన పాటలకు రైతులు డ్యాన్సులు వేస్తూ ఉత్సాహాన్ని నింపారు. మండుటెండలో సైతం భారీగా సభకు హాజరైన జనానికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యేలు తమ ప్రసంగాల్లో విపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ చేసిన కామెంట్లను సభకు వచ్చిన జనాలు చప్పట్లతో ఎంజాయ్ చేశారు. యువకులు, రైతులు సభాస్థలి వద్ద సెల్ఫీలతో సభ జ్ఞాపకాలను భద్రం చేసుకున్నారు. ఆది నుంచి జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అభిమానాన్ని చాటగా.. జిల్లా ప్రజలు కూడా అభిమానానిస్తూ వస్తున్నారు. ఐదు నెలల్లోనే సీఎం కేసీఆర్ పాల్గొన్న రెండు సభలు కూడా రెండు లక్షల మందితో విజయవంతం కావడం ఇందుకు నిదర్శనం.

30
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles