ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలపై సమీక్ష

Tue,March 19, 2019 02:17 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ, ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సత్యనారాయణ సోమవారం తన చాంబర్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 8లక్షల 10వేల 228 మంది జనాభా ఉన్నదని తెలిపారు. 22 మండలాలకు 22 మంది జిల్లా ప్రదేశిక సభ్యులు 236 మంది మండల ప్రాదేశిక సభ్యులు ఉంటారని తెలిపారు. టీ-పోల్ వెబ్‌సైట్ ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 6లక్షల 2వేల 752మంది ఉన్నట్లు చెప్పారు. పురుష ఓటర్లు 2లక్షల 91వేల 203మంది, మహిళా ఓటర్లు 3 లక్షల 11వేల 517 మంది, ఇతరులు 32మంది ఉన్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్లను విభజించి జాబితాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. జాబితా తయారీలో మార్పులు, అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలతో మంగళవారం సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 23న జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను 27న విడుదల చేస్తామని చెపారు. 30న జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles