2,642 మంది బలగాలతో కట్టుదిట్టమైన భద్రత

Tue,March 19, 2019 02:17 AM

నిజామాబాద్ క్రైం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు చర్యలు చేపట్టింది. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండ, సిద్దిపేట్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 2,642 మంది సివిల్, రిజర్వు బలగాలు సీఎం బందోబస్తులో పాల్గొననున్నాయి. నిజామాబాద్, సిద్దిపేట్ పోలీస్ కమిషనర్లు, నాగర్ కర్నూల్ ఎస్పీ, ఐదుగురు అదనపు డీసీపీ, అదనపు ఎస్పీలు, 24 మంది ఏసీపీలు, డీఎస్పీలు, ఇద్దరు ట్రెయినీ ఐపీఎస్‌లు, 77 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు మహిళా ఇన్‌స్పెక్టర్లు, 205 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్సైలు, ఎనిమిది మంది మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు, 304 మంది ఏఎస్సైలు, 304 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1390 మంది కానిస్టేబుళ్లు, 147 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు, 319 మంది మహిళా హోంగార్డులు, 119మంది ఆర్మూడ్ రిజర్వు ఫోర్స్ ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తులో పాల్గొంటారు.

సభా స్థలి వద్ద బీడీ, డాగ్ స్కాడ్ బృందాల తనిఖీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావ్ మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చేస్తున్న సందర్భంగా స్థానిక జీజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి సభా ప్రాంగనాన్ని సోమవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ధపేదార్ రాజు తదితరులతో కలిసి ప్రశాంత్ రెడ్డి సాయంత్రం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం రేంజ్ డీఐజీ ఎన్.శివశంకర్ రెడ్డిని పిలిపించి బందోబస్తు చర్యలపై అడిగితెలుసుకున్నారు. ఎంత మంది సిబ్బందిని విధులు నిర్వర్తించనున్నారు? ఎక్కడి నుంచి సభా ప్రాంగణంలోకి ఎంట్రీ ఏర్పాటు చేశారు? తదితర ప్రాంతాల నుంచి సభకు వచ్చేసిన ప్రజల వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఎక్కడ కేటాయించారనే పూర్తి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎం సభ నిర్వహించే జీజీ కళాశాల మైదానం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్ స్కాడ్ బృందాలు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణంగా తనిఖీ చేశారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles