కాంగ్రెస్, బీజేపీ కుట్ర రాజకీయాలకు బలికావొద్దు

Mon,March 18, 2019 01:35 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్, బీజీపీ కుట్ర రాజకీయాలకు రైతులు బలికావద్దని మండల రైతు నా యకులు బద్ధ్దం చిన్నారెడ్డి, రేగుంట దేవేందర్ విజ్ఞప్తి చేశారు. కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు రైతులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలో చిక్కి సంఘాల పరంగా పార్లమెంటు ఎన్నిక ల్లో నామినేషన్లు వేసి కల్వకుంట్ల కవిత గెలుపును అడ్డుకునే కుట్ర పూరిత రాజకీయాలకు రైతుల మద్దతు ఉం డబోదన్నారు. రైతులుగా ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎర్రజొన్న రైతుల కోసం టీఆర్‌ఎస్ ప్రభు త్వం, సీఎం కేసీఆర్ అండగా నిలిచిన వైనాన్ని రైతులు మరువబోరన్నారు. రైతుల కోసం 24గంటల కరెంటు, రైతు బంధు, రైతుబీమా పథకాలు అందిస్తూ, సాగునీ టి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైపే రైతు లు ఉన్నారని, అందుకే మద్దతు ధరల పేరిట కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలియదా అని వారు ప్రశ్నించారు.

ప దేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రె స్, ఇప్పుడు ఐదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీలు ఎర్ర జొన్న, పసుపునకు మద్దతు ధర విషయం తేల్చడంలో విఫలమయ్యాయని, అందుకే ఆ పార్టీ అభ్యర్థులకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయవద్దని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంటులో పలుమార్లు కేంద్రంతో పోరాడి, పసుపు బోర్డు కోసం ఆరు రాష్ర్టాల సీఎంల లేఖలు కూడగట్టిన ఎంపీ కవితకు రైతులు అండగా నిలవాలని కోరారు. టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు అందించి కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా పసుపు బోర్డును సాధించుకునే మార్గం సుగమం చేసుకుందామని కోరారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన, రైతులకు ఎర్రజొన్న బకాయిలు చెల్లించిన సీఎం కేసీఆర్‌కు రైతులు అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో రైతులు గడ్డం స్వామి, బద్ధ్దం భాస్కర్‌రెడ్డి, బద్కదం రాజేశ్వర్, మల్కాయి రాజన్న, మారు శంకర్, బద్దం రాజశేఖర్, ఏనుగు రాజేశ్వర్, వేముల శ్రీనివాస్ రెడ్డి, గడ్డం శ్రీధర్, కొమ్ముల శ్రీను, నోముల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles