మాదిగ ఉపకులాల మద్దతు టీఆర్‌ఎస్‌కే

Mon,March 18, 2019 01:35 AM

-నేటి నుంచి ఐదో విడత సర్పంచులకు శిక్షణ ప్రారంభం
డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండల కేంద్రంలోని టీటీడీసీలో సోమవారం నుంచి ఈ నెల 22 వరకు జిల్లాలోని సర్పంచులకు ఐదో విడత శిక్షణ ప్రారంభమవుతుందని జిల్లా పంచాయతీ అధికారి డి కృష్ణమూర్తి, కోర్సు డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఇప్పటికే కొత్తగా ఎంపికైన సర్పంచులకు నాలుగు విడతలుగా వివిధ మండలాల నుంచి ఎంపిక చేసిన వారికి శిక్షణ పూర్తి అయింది. సోమవారం నుంచి ఐదో విడతగా 4 మండలాల నుంచి ఎంపిక చేసిన మొత్తం 104 మంది నూతన సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని బోధన్, ఎడపల్లి, నవీపేట్, రెంజల్ మండలాల నుంచి సర్పంచులు శిక్షణకు హాజరుకానున్నారు. ఎంపిక చేసిన అధికారులు, మాస్టర్ ట్రైనర్లతో సర్పంచులకు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఖలీల్‌వాడీ: మాదిగ, మాదిగ ఉపకులాల మద్దతు టీఆర్‌ఎస్ పార్టీకే ఉంటుందని, టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలపునకు ఎమ్మార్పీఎస్ బీబీజేహేచ్‌డీ కృషి చేస్తుందని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాప య్య అన్నారు.

ఆదివారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ, మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రకటిస్తున్నామని స్పష్టం చే శారు. మాదిగ, మాదిగ ఉపకులాల అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ చూపిన చొరవ మరువలేనిది అని గుర్తు చేశారు. మాదిగ, మా దిగ ఉపకులాల డిమాండ్ల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందనే నమ్మకంతో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. మాదిగల న్యాయమైన డిమాండ్లను, మాదిగ ఉపకులాల న్యాయమైన డిమాండ్ల విషయంలో ఎంపీ కవిత ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృం దంతో చర్యలు జరిపి డిమాండ్ల విషయంలో ఒత్తిడి తె స్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

గతంలో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన పేర్కొన్నారు. తమ ఇంటి ఆడబిడ్డగా ప్రతి మాదిగ, మాదిగ ఉపకులాల బిడ్డలు నిజామాబాద్ పార్లమెంటు నుంచి కవితను లక్షల మె జార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఎమ్మార్పీఎ స్ లక్ష్యం ఎస్సీ వర్గీకరణ, డప్పు చెప్పుకు పెన్షన్ ఇవ్వాలని కోరామన్నారు. దాని గురించి గత ప్రభుత్వాలు హామీ ఇచ్చారని.. కానీ, ప్రధానితో మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవన్నారు. స్వయంగా ప్ర ధాని నరేంద్రమోదీని కలిసి ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 7వరకు పార్లమెంటు స్థానాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గెలిచే వరకు పోరాడతామన్నా రు. ఈనెల 30న తెలంగాణ ఎమ్మార్పీఎస్ సమావేశా న్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కవిత హాజరు కానున్నారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 గురుకుల పాఠశాలలు ప్రారంభించబడ్డాయని, అం దులో 80శాతం ఎస్సీ విద్యార్థులు చదువుకోవడం గ ర్వకారణమన్నారు. కేసీఆర్ వెంటే ఉంటూ అభివృద్ధిని సాధించుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉపకులాల కు ప్రత్యేక కార్పొరేషన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీ నివాస్, మాదిగ బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపకుడు రాజలింగం, రాష్ట్ర అధ్యక్షుడు హ న్మంత్, జాతీయ నాయకులు కొక్కెర భూమన్న, దం డు సురేందర్, శంకర్, ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కనకరాజు, శ్రీనివాస్, సునిల్, మహిళా విభాగం నాయకురాలు మంజుల, పోసాని, రాష్ట్ర నాయకులు పరశురాం, లక్ష్మణ్, డప్పుల చంద్రయ్య, జిల్లా నాయకులు రవి, సురేశ్, శ్రీనివాస్ ఓమాల సురేశ్, సుధాకర్, సాయిలు, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles