పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం

Sun,March 17, 2019 01:00 AM

విద్యానగర్ : జిల్లావ్యాప్తంగా పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 12,803 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిఉండగా 12,754 మంది హాజరయ్యారు. 49 మంది గైర్హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన వసతులపై ఆరా తీశారు. మాస్‌కాపీయింగ్ జరగకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని కేంద్రాల వద్ద ఫ్లయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్‌లను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles