అవసరమైతే పోలింగ్ కేంద్రాలు పెంచుతాం

Sun,March 17, 2019 12:58 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1400 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 1200 మంది ఓటర్ల కన్నా ఎక్కువ ఓటర్లు ఉంటే మరికొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జేసీ యాదిరెడ్డి తెలిపారు. జేసీ చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో దేవునిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 200 నంబర్ పోలింగ్ కేంద్రం, బీసీ బాలుర వసతి గృహంలోని 210 పోలింగ్ కేంద్రం, ఏపీయూపీఎస్ ఉర్దూ మీడియం, రైల్వేస్టేషన్ వద్ద 215 పోలింగ్ కేంద్రంలో 1400 మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైతే అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో రాజేంద్ర కుమార్, టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ముప్పారపు ఆనంద్, కాంగ్రెస్ పార్టీ నుంచి కైలాస్ శ్రీనివాస్ రావు, ఎల్. గంగాధర్, నర్సింహారావు, గోనె శ్రీనివాస్, టీడీపీ నుంచి ఖాసీం అలీ, బీఎస్పీ నుంంచి బాలరాజు, సీపీఎం నుంచి చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏవో పద్మారావు, ఎన్నికల సిబ్బంది పవన్, వరప్రసాద్, నిఖిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles