ఆదర్శ డిగ్రీ కళాశాల భవనం పరిశీలన

Sun,March 17, 2019 12:58 AM

ఎల్లారెడ్డి రూరల్ : ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్ తండా వద్ద నూతనంగా నిర్మించిన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాన్ని అకాడమిక్ గైడెన్స్ అధికారి బాల భాస్కర్ అకాడమిక్ అధికారులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉందని తెలిపారు. నిర్మాణంలో భాగంగా మిగిలిన చిన్నచిన్న పనులు పూర్తి చేసి ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. భవన నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మంచిరోజు చూసుకొని తరగతులు ప్రారంభించాలని, డిగ్రీ పరీక్షలను ఇక్కడే నిర్వహించుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. వచ్చే అకాడమిక్ సంవత్సరంలో కళాశాల ప్రాంగణంలోని వసతి గృహాలను ప్రారంభించాలని అన్నారు. కళాశాలకు పంపిన ఫర్నిచర్‌ను తరగతి గదుల్లో సెట్ చేయాలని, పట్టణానికి దూరంగా కళాశాల ఉందని సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేయించాలన్నారు. ఇందుకోసం ఎక్విప్‌మెంట్ ఫండ్ రిలీజ్ చేస్తామని తెలిపారు. కళాశాల భవనం చుట్టూ ఉన్న 20 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా ఫెన్సింగ్ చేయించాలని ఇందుకోసం కళాశాల నిధులు వాడుకోవాలని ఆదేశించారు. ఆయనతో అకాడమిక్ ఆఫీసర్ నీరజ, రూసా కో ఆర్డినేటర్ సౌందర్య, కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ ఉన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles