డీసీవోగా మమత

Sun,March 17, 2019 12:58 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొంత కాలంగా ఇన్‌చార్జి అధికారి పర్యవేక్షణలో సాగిన కామారెడ్డి జిల్లా కో-ఆపరేటివ్ శాఖకు పూర్తి స్థాయి అధికారి నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బెల్లంకొండ మమతను కామారెడ్డి జిల్లా కో-ఆపరేటివ్ అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011 గ్రూప్- 1 బ్యాచ్‌కు చెందిన ఈమెకు ఇదే తొలి పోస్టింగ్ కావడం విశేషం. బెల్లంకొండ మమత ఏడాది కాలంగా శిక్షణలో ఉన్నారు. శిక్షణ పూర్తైన పిమ్మట నేరుగా కామారెడ్డి జిల్లా సహకార అధికారిగా నియమితులు కాగా ఆమె విధుల్లోనూ చేరారు. ఇంతకాలం ఇన్‌చార్జిగా పని చేసిన శ్రీనివాస్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో సహకార ఎన్నికల సందడి నెలకొన్న వేళ జిల్లాకు నిజామాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. ఈయన పర్యవేక్షణలోనే జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఓటర్ల జాబితా వెల్లడైంది. ఇంతలోనే పీఏసీఎస్‌లకు గడువు పెంపుతో ఎన్నికల ప్రతిపాదన వాయిదా పడడంతో సహకార శాఖలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

32
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles