సమస్యల పరిష్కారానికి కృషి

Sun,March 17, 2019 12:58 AM

విద్యానగర్ : ఉమ్మడి జిల్లాల నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ శాసన మండలి ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమన్య హోటల్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీఆర్‌ఎస్, పలు ఉపాధ్యాయ, అధ్యాపకుల సంఘాలు తనకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. 2014లో వేతన సవరణ కమిషన్ సిఫారసులకు మిన్నగా 43 శాతం ఫిట్‌మెంట్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించానని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మికులకు ఇంక్రిమెంట్ సాధించేందుకు చేసిన ప్రయత్నంలో తన వంతు పాత్ర ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు కేసులతో సంబంధం లేకుండా రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా కనీస వేతనం నిర్ణయించేందుకు తన వంతు కృషి చేశానని తెలిపారు. భాషా పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని చేసిన పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. తనను గెలిపిస్తే ఏకీకృత సర్వీస్ రూల్స్, అప్‌గ్రేడ్ తదితర అంశాలపై చట్టసభలో మాట్లాడుతానని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, రాజేశ్, పండిత పరిషత్ అధ్యక్షుడు బషీర్ పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles