రేపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

Sun,March 17, 2019 12:57 AM

విద్యానగర్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై సమీక్షించారు. ఈవీఎం, వీవీప్యాట్ల యంత్రాల పనితీరుపై జిల్లాల వారీగా చర్చించారు. ఈ నెల 15 వరకు ఫారం - 6 ద్వారా వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను వెంటనే పరిశీలించి అప్‌డేట్ చేయాలని, ఫారం 7, 8, 8ఏ లను శనివారం రాత్రి లోగా పరిష్కరించాలని సూచించారు. ఫొటో ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్యక్రమం ఈ నెల చివరి నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణకు చివరి రోజని వివరించారు. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ పరిశీలన కార్యక్రమాలకు సంబంధించి నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలని సూచించారు. రాష్ట్ర జాయింట్ ఎన్నికల ముఖ్య అధికారి ఆమ్రాపాలి, రాష్ట్ర అడిషనల్ ముఖ్య ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాశ్ జిల్లాల వారీగా ఎన్నికల ప్రక్రియపై సమీక్షించారు. కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యనారాయణ, జేసీ యాదిరెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేంద్ర కుమార్, రాజేశ్వర్, దేవేందర్ రెడ్డి, సీపీవో శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలనాధికారి పద్మారావు, ఎన్నికల సిబ్బంది శ్రీనివాస్ రావు, పవన్, వరప్రసాద్, సాయి భుజంగరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles