ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

Sat,March 16, 2019 12:39 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : పట్టభద్రుల ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనంలో ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, విధులు సక్రమంగా నిర్వహించకపోతే వేటు పడే అవకాశం ఉందన్నారు.

బ్యాలెట్ పేపర్ స్థానంలో వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగంతో పేపర్ వినియోగం భారీగా తగ్గిందన్నారు. పలువురు అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునే పద్ధతులను వివరించారు.

పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ...
ఈ నెల 22న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో చిత్రీకరణ చేయనున్నట్లు వివరించారు. ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జరర్ ఉంటారని వివరించారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన 786 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే పరిశీలించామన్నారు. జిల్లాలో 6 లక్షల 28వేల మంది ఓటర్లు ఉన్నారని, ఇప్పటివరకు ఆన్‌లైన్ చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ఓటు హక్కును కల్పిస్తామని తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలో ఎన్నికల సిబ్బందికి మొదటి విడతలో శిక్షణ ఏర్పాటు చేశామని, రెండో విడతలో మరోసారి శిక్షణ ఉంటుందని చెప్పారు.

చెట్లతోనే మానవ మనుగడ...
చెట్లతోనే మానవ మనుగడ ఉంటుందని కలెక్టర్ అన్నారు. అడవుల శాతం గణనీయంగా తగ్గిందని, మొక్కలు నాటి వాటిని పెంచాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గత సంవత్సరం నాటిన మొక్కలకు వాటర్ డే సందర్భంగా నీరు పోశారు. వేసవిలో మొక్కలకు సకాలంలో నీరు పోయాలన్నారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్ రెడ్డి, డీఆర్డీవో చంద్రమోహన్ రెడ్డి, తహసీల్దార్ మహిపాల్, ఎంపీడీవో చిన్నారెడ్డి. ఉపాధి హామీ ఏపీవో సక్కుబాయి, ఈసీ సాయిలు, ఎంఈవో వెంకటేశం తదితరులు ఉన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles