రాష్ట్రంలో 15,154 ఎకరాల భూమి కొనుగోలు

Sat,March 16, 2019 12:39 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 15 వేల 154 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్ కుమార్ తెలిపారు. రూ. 659 కోట్లతో కొనుగోలు చేసి 5,962 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల్లో నిరుపేద ఎస్సీ కుటుంబాలను ఆదుకోవడానికి మూడెకరాల భూమిని కొనుగోలు చేసి ఇవ్వడమే కాకుండా సంవత్సర కాలానికి పంట పెట్టుబడితో పాటు బోరు, కరెంట్ సరఫరా తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 1230 ఎకరాల భూమిని రూ. 57.17 కోట్లతో ఖరీదు చేసి 530 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. భూమి కొనుగోలు చేసినప్పుడే 22 బోరులు ఉన్నాయని తెలిపారు. మిగితా భూముల్లో 193 బోర్లు వేయాల్సి ఉందని, 136 బోర్లు వేసేందుకు కోటీ 62 లక్షల రూపాయలు గతేడాది మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో 36 బోర్లు వేశారని తెలిపారు. 7 బోర్ల పనులు గ్రౌండ్ లెవల్ పూర్తి అయిందని చెప్పారు. 43 బోర్లకు విద్యుత్ శాఖ అధికారులు గతేడాది నుంచి విద్యుత్ సరఫరా అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. వారం రోజుల్లో 20 బోర్లకు విద్యుత్ కనెక్షను అందజేస్తారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు.

అధికారులతో సమీక్షా సమావేశం...
జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, గ్రౌండ్ వాటర్ అధికారులు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, డీఈలతో మాట్లాడి గత సంవత్సరం మంజూరు చేసిన 136 బోరువెల్స్ విషయంపై సమీక్షించారు. బోరు పనులు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి శ్రీనివాస్ బాబు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సత్యనారాయణను ఆనంద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.

32
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles