చంద్రశేఖర్ గౌడ్‌కు టీఎన్జీవోల సంపూర్ణ మద్దతు

Fri,March 15, 2019 12:56 AM

విద్యానగర్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు టీఎన్జీవోలు సంపూర్ణ మద్దతు ఇస్తాయని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ శాసన మండలి, పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా ఓటు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని ఎలక్షన్ కమిషన్‌కు విన్నవించామని తెలిపారు. తెలంగాణ శాసన మండలి, పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉద్యోగుల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించారన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేటి కాలంలో ఖర్చుల దృష్ట్యా ఉద్యోగుల రవాణా భత్యాలను, కరువు భత్యాన్ని 50 శాతం పెంచాలని కోరారు. పీఆర్సీని 63 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించామని, సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హమీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు దయానంద్, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, కోశాధికారి నాగరాజు, నాయకులు చక్రధర్, విజయలక్ష్మి, సునీల్, వెంకటేశ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles