ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

Fri,March 15, 2019 12:56 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, సర్పంచులకు శిక్షణ, ఎన్నికల కోడ్ నియమావళిపై సమీక్షించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలని, రెండు వారాల్లో ఇందుకు సంబంధించిన పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. మొక్కల పెంపకంలో జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఉద్యానవన శాఖ సహకారంతో వెదురు మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా చేపట్టే అన్ని పనులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, దీనిపై కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

నెలాఖరులోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేయాలి
అన్ని జిల్లాల్లో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, వీధి దీపాలు, ఇంకుడు గుంతల నిర్వహణ, వంద శాతం మరుగదొడ్ల నిర్మాణాలపై సర్పంచులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ -పంచాయతీ సాఫ్ట్‌వేర్ నిర్వహణపై సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులుకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా చూడాలని, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఎన్నికల ప్రచార ప్లెక్సీలు, వాల్‌పోస్టర్లు, బ్యానర్లు లేకుండా చూడాలని సూచించారు. జిల్లాస్థాయి వెబ్‌సైట్లను తొలగించాలన్నారు. మున్సిపల్, అర్బన్ సెక్టర్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ... సాలిడ్ వేస్ట్‌ను సైంటిక్ పద్ధతిలో డిస్పోస్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దీనిపై అవగాహన ఉన్న ఏజెన్సీలను, నిపుణుల టీములను జిల్లాలకు పంపుతామని తెలిపారు. జిల్లాల్లో గార్బేజ్ కలెక్షన్స్, డంపింగ్ యార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో రూట్ మ్యాప్ నిర్వహించాలని, ఈ నెల 30లోగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అజయ్ మిశ్రా, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అథారిటీ చైర్మన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి రాములు, గ్రామీనాభివృద్ధి శాఖ సెక్రెటరీ నీతూ కుమారి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యనారాయణ, జేసీ యాదిరెడ్డి, సీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, డీఎఫ్‌వో వసంత, జిల్లా పంచాయతీ అధికారి నరేశ్, అసిస్టెంట్ అధికారి సాయన్న, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles