అర్హులందరికీ పదోన్నతులు కల్పించాలి

Fri,March 15, 2019 12:55 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : అర్హులైన అధ్యాపకులందరికీ కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం ద్వారా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ యూనివర్శిటి టీచర్స్ అసోసియేషన్ (టూటా) సభ్యులు గురువారం వీసీ ఆచార్య పి.సాంబయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దరఖాస్తుల గడువు ముగిసినందున సీఏఎస్ తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. విభాగాల వారీగా స్క్రీనింగ్ కమిటీల నియామకం చేసి పదోన్నతుల ప్రక్రియ ముందుకు తీసుకుపోవాలన్నారు. గత సంవత్సరం సర్వీసులో మరణించిన ఆచార్యుడు టి.సత్యనారాయణచారీ సతీమణి శ్రీవాణిని కారుణ్య నియామకం కింద ఎలాంటి జాప్యం లేకుండా తీసుకోవాలన్నారు. ఆర్జిత సెలవులకు ఆర్హులైన పరీక్షల నియంత్రణ విభాగంలో విధులు నిర్వహించిన ఇతర కీలక పరిపాలన పదవుల్లో పని చేసిన అధ్యాపకులకు ఆర్జిత సెలవులు మంజూరి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా అధ్యాపకులకు ఐదు స్పెషల్ క్యాజువల్ లీవ్‌లు, చైల్డ్ కేర్ సెలవులు మంజూరు చేయాలని కోరారు. గ్రేడ్ పే పెరిగినప్పుడు ఒక ఇంక్రిమెంట్ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రార్‌లను కలిసిన వారిలో టూటా అధ్యక్షుడు డాక్టర్ కె.రాజారాం. ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.పున్నయ్య, ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.సంపత్‌కుమార్, కోశాధికారి అతిక్‌సల్తాన్ ఘోరి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ మూసాఖురేషి, బి.నందిని, కార్యనిర్వాహక సభ్యుడు డాక్టర్ అతర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles