ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌ను కలిసిన త్రివేణి

Fri,March 15, 2019 12:55 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ విభాగాధిపతి డాక్టర్ వి.త్రివేణి హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రిని గురువారం ఆయన ఛాంబర్‌లో కలిశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన తెలంగాణ సాహిత్యం, జీవనాధార వృత్తులు,సాంస్కృతిక అధ్యయనం అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త నిర్వహణలో విజయవంతంగా నిర్వహించిన సంగతి విదితమే. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఆచార్య ఆర్.లింబాద్రి విశిష్ట అతిథిగా రావాల్సి ఉండగా ప్రభుత్వ పనుల బాధ్యతపై హాజరుకాలేకపోయారు. దీంతో డాక్టర్ వి.త్రివేణి ఆచార్య ఆర్.లింబాద్రిని కలిసి సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య పి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్-2 ఆచార్య వెంకటరమణను కలిసి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ గ్రామీణ పరిసర ప్రాంతాల్లో ఉన్నతెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ వి.త్రివేణి దేశవిదేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి సమర్ధవంతంగా అంతర్జాతీయ సదస్సును నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటినీ కలుపుకొని జీవనాధార వృత్తుల మీద అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సాహిత్యం ద్వారా సమాజ అవగాహన, వృత్తి అధ్యయన శాఖలను పరిశీలిస్తూ వందకుపైగా పత్రసమర్పణ చేయడం ఎంతో మంది సాహితీకారులను, అధ్యాపకులను, పరిశోధకులను ఆహ్వానించడం ముదావహమని కొనియాడారు.సదస్సుకు రాకపోయినా ఎప్పటికప్పుడు సదస్సులో జరుగుతున్న విషయాలను తెలుసుకున్నట్లు తెలిపారు. సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ ప్రొఫెసర్ డాక్టర్ డేనియల్ నెగెర్స్‌ను ఆచార్య లింబాద్రికి డాక్టర్ త్రివేణి పరిచయం చేశారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles