కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు

Fri,March 15, 2019 12:55 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాలకు చెందిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం పదో రోజూ కొనసాగాయి. నిజామాబాద్ నగర శివారులోని రాజారాం స్టేడియంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ సమక్షంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన పరీక్షలకు వెయ్యి మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 910 మంది పురుష అభ్యర్థులు హాజరయ్యారని సీపీ వెల్లడించారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతి చుట్టు కొలతల్లో అర్హత పొందిన వారికి మొదట 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. పరుగులో అర్హత సాధించిన వారికి కాసేపు విశ్రాంతి కల్పించి తదుపరి ఈవెంట్స్ నిర్వహించారు. అభ్యర్థులు ఫలితాలను tslprb.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి పారదర్శకంగా కానిస్టేబుల్, ఎస్సై ఎంపికలు జరుగుతున్నాయని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పరీక్షలు ఈ నెల 18 వరకు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీసీ ఎం. శ్రీధర్‌రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ గౌస్‌ఆలం, ఆర్మూర్, బోధన్ ఎస్‌బీ, ఏఆర్, ట్రాఫిక్ సీసీఎస్, ఏసీపీలు రాములు, రఘు, రాజారత్నం, సీహెచ్ మహేశ్వర్, ఆర్. ప్రభాకర్‌రావు, టీ. స్వామి, కామారెడ్డి డీఎస్సీ లక్ష్మీనారాయణ, జిల్లా పరిపాలనాధికారి సత్యకుమార్, సీఐలు, ఎస్సైలు, సూపరింటెండెంట్లు శ్రీనివాస్, మక్సూద్ హైమద్, జనార్దన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు. ఈ స్టాఫ్ ఇన్‌చార్జులు వంశీ చక్రవర్తి, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, ఫిజికల్ డైరెక్టర్లు చంద్రప్రకాశ్, స్వప్న, పీఈటీలు, మెడికల్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles