రైతు జీవితానికి ధీమా..!

Wed,February 20, 2019 01:20 AM

కామాడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:రైతుల మేలు కోసం వినూత్న పథకాలను అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చిన రైతు బీమా పథకం ఆయా కుటుంబాలకు కొండంత ఆసరాను ఇస్తోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా పంటకు పెట్టుబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సర్కారు ఈ పథకంతోనూ ప్రత్యేకతను చాటారు. పెట్టుబడి సాయం పథకంతో గ్రామాల్లో రైతన్నలంతా సంతోషంలో మునిగితేలుతున్న వేళ వారికి జీవన భద్రత కల్పించేందుకు రైతుల పేరిట ప్రభుత్వమే బీమా సౌకర్యం అందుబాటులోకి తేవడంతో పేద రైతు కుటుంబాలకు ధీమాను నింపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూన్స్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) సంస్థలు ఒప్పందంతో అమల్లోకి వచ్చిన బీమా పథకం ద్వారా జిల్లాలో వందలాది కుటుంబాల్లో వెలుగు నింపుతోంది. ఆయా కారణాలతో పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాల్లో రూ.5లక్షల బీమా చెల్లింపుల మూలంగా వారికి భద్రతను కల్పించినట్లు అయ్యింది.

రైతు జీవితానికి ధీమా
వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రత్యేక గుర్తింపును తీసుకు వస్తున్నారు. రైతులంటే యాచించే స్థాయి కాదని, వారిది శాసించే స్థాయి అంటూ పలు మార్లు ముఖ్యమంత్రి చెబుతూ వస్తోన్న మాటలిప్పుడు నిజం అవుతున్నాయి. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబె వారు అడుగక ముందే అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. రైతు బిడ్డనే ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడంతో తెలంగాణ రైతాంగానికి ఎనలేని ప్రాధాన్యత దక్కుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని పథకాలను తెలంగాణ కర్షకులకు అందిస్తూ వారికి అనేక రకాలుగా మేలును కల్పిస్తున్నారు. గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది రైతులకు బీమా సౌకర్యమే లేదు. వారికి బీమా అంటేనే తెలియని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా దళిత, గిరిజన కుటుంబాలకు బీమా సౌకర్యాలకు సంబంధించిన విషయాలపై అవగాహన లేదు. బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రైతులకు ఉచితంగా కల్పించడం మూలంగా వారి కుటుంబాల్లో ధీమాను నింపుతోంది.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles