జర్నలిస్టుల సంక్షేమానికి సర్కార్ పెద్దపీట

Sun,February 17, 2019 02:16 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.34 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిందన్నారు. దాని నుంచి వచ్చే వడ్డీని జర్నలిస్ట్‌ల కుటుంబాలను ఆదుకోవడానికి వినియోగిస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 150 మంది జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో 57 మంది జర్నలిస్ట్‌ల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది జర్నలిస్టులు మృతి చెందారన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి రూ.లక్ష తోపాటు మృతుల భార్యలకు మూడు రూవేలు, పిల్లలకు నెలకు వేయి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. అనారోగ్యంతో దవాఖానలో చికిత్సలు పొందిన 25 మంది జర్నలిస్టులకు 50 వేల రూపాయల చొప్పున ఈ నెల 19న హైదరాబాద్‌లో చెక్కుల పంపిణీ చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు.

జర్నలిస్ట్‌లకు హెల్త్‌కార్డులు పని చేస్తున్నాయని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలో అంజాగౌడ్, జి. శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్ కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. కామారెడ్డిలో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ సత్యనారాయణలతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌తో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఫండ్‌ను పెంచడానికి కృషి చేస్తామన్నారు. ప్రెస్ అకాడమీ తరుపున జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమీ పని చేస్తుందన్నారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆల్లం నారాయణలతో పాటు అంథోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు మారుతీ సాగర్, ఇస్మాయిల్‌ను కామారెడ్డి జర్నలిస్ట్‌లు సన్మానించారు. కామారెడ్డి జిల్లా జర్నలిస్ట్ నాయకులు భూపతి, అంజి, రాము, రాజు, రాజేశ్, శివ, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles