ప్రశాంతంగా ఎన్నికలు: ఎస్పీ

Mon,January 21, 2019 12:14 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని తొమ్మిది మండలాల్లో సోమవారం జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్వేతారెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొదటి విడతలో జరిగే 133 గ్రామ పంచాయతీలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేవిధంగా పోలీసు లు బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న రూట్ మొబైల్, క్విక్ రియాక్షన్ టీం, ైస్ట్రెకింగ్ ఫోర్స్, స్పెషల్ ైస్ట్రెకింగ్ ఫోర్స్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ వాహనాదారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. రోడ్డు ప్రమాదాలు ఏవిధంగా జరుగుతాయో వీడియోల ద్వారా పోలీసు అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ముగ్గురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles