ఊరంతా ‘ఏక’మై..

Sun,January 20, 2019 12:56 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహకు అందని స్థాయిలో సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలు ఘననీయంగా నమోదు అవుతున్నాయి. మూడు విడతలుగా నిర్వహిస్తున్న నామినేషన్ ప్రక్రియలో ఒక్కో విడతలోనే భారీ మొత్తంలో పంచాయతీల్లో ప్రజలు ఐక్యతారాగంతో ఎన్నికలకు దూరంగా ఉండిపోతున్నారు. అంతా ఏకమై గ్రామ అభివృద్ధికి నడుం బిగించి ఏకగ్రీవ తీర్మానాలకు సై అంటున్నారు. దీంతో ఊరి మాటగా ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో 526 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతానికి వందకు పైగా గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడో విడతలో నామినేషన్ ఉపసంహరణకు ఆదివారం వరకు సమయం ఉన్నందున మరిన్ని గ్రామాల్లోనూ ఏక నామినేషన్ కొనసాగే అవకాశం లేకపోలేదు. పలు గ్రామాల్లో నామినేషన్ ఏకగ్రీవ సర్పంచ్ కోసం పలువురు ఆశావహులు ఒక మెట్టు దిగి ఉపసంహరణకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు జిల్లాలోని మూడు విడతల్లో ఏక నామినేషన్ నమోదైన పంచాయతీలు 106కు చేరడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నుకోవడం జిల్లాలో ఇదే తొలిసారి. గత సర్పంచ్ ఎన్నికల్లో జిల్లా మొత్తం కేవలం 25 గ్రామాల్లోనే ఏకగ్రీవ సర్పంచులు నమోదు అయ్యాయి.

2013లో 25 చోట్ల మాత్రమే
ఏకగ్రీవం...
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవ తీర్మానాల హవా కొనసాగింది. కామారెడ్డి జిల్లాలో పాత గ్రామ పంచాయతీ లెక్కల ప్రకారం 25 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నికయ్యారు. ఇందుకు ప్రభుత్వాలు కల్పించిన ఆర్థిక వెసులుబాటు ముఖ్య కారణం కాగా, స్థానిక రాజకీయ పరిస్థితులు సైతం కలిసి వచ్చాయి. గ్రామంలో మౌలిక సదపాయాల కల్పన, ఊరి బాగు మేలు, అభివృద్ధి పథాన గ్రామాన్ని ముందుకు తీసుకు పోవాలనే ల క్ష్యంతో పల్లెల్లో ఈ రకమైన సంస్కృతికి పెద్ద పీట పడుతోంది. 201 3లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 25 చోట్ల మాత్ర మే ఏకగ్రీవాలు నమోదయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. బిక్కనూరులో 1, గాం ధారిలో 6, కామారెడ్డిలో 1, లింగంపేటలో 2, మాచారెడ్డిలో 3, నాగిరెడ్డిపేటలో 2, తాడ్వాయిలో 1, ఎల్లారెడ్డిలో 3, జుక్కల్ 2, బాన్సువాడలో 1, మద్నూర్ 3 గ్రామాలు చొప్పున ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్నారు. ఈసారి అనూహ్యంగా ఈ సంఖ్య భారీగా పెరిగింది.

రెండో విడతలోనే అత్యధికంగా...
మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు జిల్లా మొత్తం 106 గ్రామాల్లో ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో రెండో విడతలోనే భారీగా 52 గ్రా మాల్లో ఏక నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 30 గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచులు నమోదయ్యా యి. మూడో విడతలో 23 చోట్ల ఒకే ఒక్క నామినేషన్ పడింది. ఆదివారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉన్నందున మూడో విడతలో మరిన్ని గ్రా మాల్లో ఏకగ్రీవ పంచాయతీలయ్యే వీలుందని తెలుస్తోంది. మొదటి విడతలో మొత్తం 31 గ్రామాల్లో ఒకే నామినేషన్ దాఖలైంది. ఇందులో భిక్కనూరులో 2, రాజంపేటలో 6, బీబీపేటలో 1, మాచారెడ్డిలో 11, సదాశివనగర్ 5, రామారెడ్డిలో 3, కామారెడ్డిలో 1 చొప్పున ఏకగ్రీవాలయ్యాయి.
రెండో విడతలో మొత్తం 52 చోట్ల ఏకగ్రీవాలు కాగా ఇందులో ఎల్లారెడ్డిలో 8, లింగంపేటలో 9, నాగిరెడ్డిపేటలో 2, గాంధారిలో 21, నిజాంసాగర్ 10, పిట్లంలో 2 గ్రామాల్లో ఏకగ్రీవ పంచాయతీలున్నాయి. మూడో విడతలో మొత్తం 23 గ్రామాల్లో ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో బాన్సువాడలో 9, బీర్కూర్ 4, నస్రుల్లాబాద్ 2, బిచ్కుందలో 3, మద్నూర్ 1, పెద్దకొడప్ 2, జుక్కల్ లో 2 గ్రామాల్లో ఒకే నామినేషన్ దాఖలైంది.

ముగిసిన జాతీయ యువ పార్లమెంట్
రాజంపేట్ (సౌత్ తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కొనసాగుతున్న జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ శనివారం ముగిసింది. కార్యక్రమానికి కామారెడ్డిలోని పలు డీగ్రీ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు బేటీ బచావో- బేటీ పడావో, మహిళా సాధికారత, జన్ యోజనా, ముద్ర యోజనా తదితర అంశాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేశ్వరి, నోడల్ అధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles