స్పీకర్ అభినందనల వెల్లువ

Sun,January 20, 2019 12:55 AM

బాన్సువాడ రూరల్/బీర్కూర్/నస్రుల్లాబాద్/ పిట్లం: శాసనసభ స్పీకర్ ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డిని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గంలోని పలువురు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తమ నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యుడికి దక్కిన అరుదైన గౌరవంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ శ్రావణ్ కుమార్, పారిశ్రామికవేత్త మోరీల్ శ్రీనివాస్ పాటు శ్రీనివాస్ తదితరులు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో స్పీకర్ పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామానికి చెందిన టీఆర్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్ ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ తదితరులు స్పీకర్ శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
బీర్కూర్ మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ ఆధ్వర్యంలో బీర్కూర్ మండల టీఆర్ నాయకులు, భైరాపూర్ గ్రామ నాయకులు స్పీకర్ కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధానకార్యదర్శి రామకృష్ణాగౌడ్, ఆర్ మండల కో ఆర్టినేటర్ ద్రోణవల్లి అశోక్, సొసైటీ చైర్మన్ మొగులుగొండ, పార్టీ గ్రామ అధ్యక్షుడు గుమ్మ లక్ష్మణ్, మాజీ సర్పంచి హన్మాండ్లు, శ్రీనివాస్, పండరి పటేల్ తదితరులు ఉన్నారు.
పిట్లం టీఆర్ నాయకులు శుక్రవారం రాత్రి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని తన స్వగృహంలో శుక్రవారం రాత్రి కలిసి శాలువాలతో సత్కరించారు. స్పీకర్ కలిసిన వారిలో ఏఎంసీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles