చట్టాలు కఠినతరం.. అతిక్రమిస్తే జైలుకే!

Sun,January 20, 2019 12:55 AM

పాత బాన్సువాడ : చట్టాలు రోజురోజుకూ కఠినంగా మారుతున్నాయని, అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని బాన్సువాడ జూనియర్ సివిల్ శ్రీనివాస్ అన్నారు. చట్టాలు ఏఒక్కరి కోసమో కాదని అందరికీ వర్తిస్తాయని పేర్కొన్నారు. బాన్సువాడ కోర్టు ఆవరణలో న్యాయ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ప్రజలకు అవగామన కల్పించారు. పోలీసు కళాజాత అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడియో దృశ్యాలతో పలు విషయాలపై ఉదహరించారు. అన్ని ధ్రువపత్రాలు ఉంటేనే వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్, సెల్ డ్రైవింగ్ చేయవద్దని కేలవం వాహనదారుడిదే జీవితం కాదని ఎదురుగా వస్తున్న వారి ప్రాణాలను, వారిపై ఆధారపడి ఉన్న కుటుంబీకుల జీవితాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పేకాటపై కఠినమైన చట్టాలు కఠినతరమైనాయని గతంలో మాదిరిగా పదో పరకో జరిమానాలకు కాలం చెల్లిందని చెప్పారు. మొదటిసారే జరిమానాతోపాటు జైలుశిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. పేకాట, వాహన ప్రమాదాలు, పెట్టీ కేసుల పరిష్కారానికి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, ఎస్ మహేశ్ రూరల్ సీఐ మధుసూదన్, న్యాయవాదులు ఖలీల్, మోహన్ హన్మంత్ మొగులయ్య, ఎస్సై సంపత్ పోలీసు, కళాజాత సిబ్బంది పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles