మొదటి విడత ప్రచారానికి తెర

Sun,January 20, 2019 12:54 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర పడింది. జిల్లాలో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్న తొమ్మిది మండలాల్లో ఉన్న 164 గ్రామ పంచాయతీలకు గాను 31 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 133 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి శనివారంతో తెరపడింది. జిల్లాలోని కామారెడ్డి డివిజన్ తొమ్మిది మండలాలు భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట్, రాజంపేట్, సదాశివనగర్, తాడ్వాయి, రామారెడ్డి, కామారెడ్డి మండలాల్లోని 164 గ్రామ పంచాయతీలకు గాను 133 గ్రామ పంచాయితీ సర్పంచ్ స్థానం పోటీకి 688 మంది అభ్యర్థులు ప్రచారాన్ని గ్రామాల్లో హోరెత్తించారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల పర్వం కొనసాగగా, 10న నామినేషన్ల పరిశీలన, 11న అప్పీల్ అవకాశం, 12న అప్పీల్ పరిష్కారం చివరి తేదీ, 13న అభ్యర్థుల ఉపసంహరణతో ముగిసింది. 14వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు తెరలేపారు. 14 నుంచి 19వ తేదీ వరకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.

ఈసారి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే ప్రధానం కావడంతో తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి అభ్యర్థులు ప్రచారం చేపట్టారు. గ్రామాల్లో అధిక శాతం ఉన్న కుల సంఘాలను తమ వైపు తిప్పుకోవడానికి నజారానాలు అందజేశారు. మరికొంత మంది సంక్రాంతి పండుగ కలిసి రావడంతో కుల సంఘాలను మేకలను గొర్రెలను కూడా అందజేసి ఓట్లు అభ్యర్థించారు. మద్యం గ్రామాల్లో జోరుగా పంపకాలు జరిపారు. ఓటింగ్ ముందురోజు కావడంతో ఆదివారం రహస్య ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను గాలం వేయనున్నారు. ముఖ్యంగా ఈసారి రంగంలో మహిళలు ఆధికంగా పోటీ పడుతున్నారు. మరికొన్ని చొట్ల యువతీ మహిళలు, యువకులు పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ కొనసాగుతుంది. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles