ముగిసిన ఈ-విన్ యాప్ శిక్షణ

Sat,January 19, 2019 12:04 AM

విద్యానగర్: యునైటెడ్ నేషనల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఈ-విన్ యాప్‌పై నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. రెండో రోజు శిక్షణలో భాగంగా పసి పిల్లలు, గర్భిణులకు పంపిణీ చేసే వ్యాధి నిరోధక టీకాలను పీహెచ్‌సీల్లో నిల్వ ఉంచడం, ఆరోగ్య సిబ్బందికి అందజేయడం, టీకాల పంపిణీ పూర్తయ్యాక తొమ్మిది రకాల వ్యాక్సిన్లను నిల్వ ఉంచు విధానాలపై అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్లలో వివరాల నమోదుపై జిల్లాలోని 13 కోల్డ్ చైన్ పాయింట్స్‌లో ఉన్న 13 ఫార్మాసిస్టులకు, స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. ఆవాస ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీ బుధ, శనివారాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇస్తారని తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బందికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో యునైటెడ్ నేషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎ.అనీల్‌కుమార్, డాక్టర్ అతుల్ నిగమ్ పి.సంజీవ్‌రెడ్డి, ఫార్మాసిస్టులు, నర్సులు పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles