ప్రతిరోజూ ఎన్నికల ఖర్చులు సమర్పించాలి

Sat,January 19, 2019 12:04 AM

గాంధారి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార ఖర్చులకు సంబంధించిన వివరాలను ప్రతీరోజు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు శుక్రవారం ఎన్నికల నియమావళి, ఖర్చులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ అధికారి మాట్లాడుతూ.. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రతీ రోజు ప్రచార ఖర్చుల వివరాలను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఖర్చుల వివరాలను అందజేయని అభ్యర్థులను ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనర్హత వేటు వేయడం జరుగుతుందని, దీంతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు సుమారు మూడేళ్ల వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందని వివరించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకే ఖర్చు చేయాలని, మంచి ఖర్చుచేస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో సాయాగౌడ్, ఈవోపీఆర్డీ, అభ్యర్థులు పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles