గవర్నర్‌ను కలిసిన స్పీకర్ పోచారం

Sat,January 19, 2019 12:04 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం శాసనసభాపతిగా ఎన్నికైన సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కుటుంబ సమేతంగా మరాద్య పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో స్పీకర్ తనయులు పోచారం రవీందర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి , సోదరుడు పరిగె శంభురెడ్డి, అల్లుడు పెద్ద వెంకట్రామ్ రెడ్డి, చిన్న వెంకట్రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మనువళ్లు, మనువరాళ్లు, కోడళ్లు తదితరులు ఉన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles