బాన్సువాడలో టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు

Thu,January 17, 2019 11:59 PM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడలో టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు అంబురాన్నంటాయి. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గురువారం హైదరాబాద్‌లో శాసనసభ స్వీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, దేశాయిపేట్ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పోచారం స్వగృహంలో మైనార్టీ నాయకులు వాహబ్, యూనుస్, మాజీ ఎంపీటీసీ దేవికృష్ణ ప్రసాద్‌తోపాటు పలువురు నాయకులు కలిసి భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలను సన్మానించారు. టీఆర్‌ఎస్ నాయకులు దొడ్లె వెంకట్రామ్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దుద్లా అంజిరెడ్డి, నాయకులు మాజీ ఎంపీపీ డాక్టర్ గంగాధర్, మహ్మద్ ఎజాస్ కొత్తకొండ భాస్కర్, కొర్ల పోతురెడ్డి, ముదిరెడ్డి విఠల్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, నార్ల ఉదయ్, పాతబాలు, అలీమొద్దీన్ బాబా, ముఖీద్, మహేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, సంజీవరెడ్డి, దుర్గారెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్ : మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. టీఆర్‌ఎస్ పారీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పారీ గ్రామ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్, ఎంపీటీసీ కంది మల్లేశ్, నాయకులు సాయిరాం, మైశాగౌడ్, జగన్, బాలక్రిష్ణ, మల్లేశం గౌడ్, నారాయణ, గంగారాం తదితరులు ఉన్నారు.

వర్ని : వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ శాసన సభ స్పీకర్‌గా సీఎం కేసీఆర్ సమక్షంలో నామినేషన్ దాఖలు సమర్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో వర్ని, రుద్రూర్ మండలాల టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles