రైతుబంధు దేశానికే ఆదర్శం: ఎంపీ బీబీపాటిల్

Tue,January 15, 2019 04:57 AM

పిట్లం: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. మండల కేంద్రంలో సాయిబాబా ఆలయాన్ని ఆయన సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మితో పాటు వార్డు సభ్యుల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు మండలంలో ఈ నెల 25న జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండల కేంద్రాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, రోడ్డుకిరువైపులా విద్యుద్దీపాలు, ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, పట్టణ అధ్యక్షుడు నవీన్, ఎంపీటీసీ జగదీశ్, శోభాలక్ష్మణ్, విండో చైర్మన్ గోపాల్‌రావ్, ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు కరీం, శశిధర్, నవీన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి చేరిక..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెజుగం నర్సింహులు సోమవారం ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ఎంపీ టీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజారంజక పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కరీం, శశి, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్, సాయిలు, రహమతుల్లా పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles