ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

Mon,January 14, 2019 01:41 AM

గాంధారి : ఓట్టు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం గాంధారి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ కేం ద్రాన్ని పరిశీలించా రు. ఈ సందర్భం గా ఇప్పటి వరకు స్వీకరించిన సర్పం చి, వార్డు సభ్యుల నామినేషన్ వివరాలను, రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడికి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ...ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. జిల్లాలో మూడు విడుతల్లో 526 పంచాయతీలకు, 4642 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. మొదటివిడుతకు సం బంధించి 164 గ్రామ పంచాయతీ సర్పంచిలకు 976 నామినేషన్లు రాగా, 1508 వార్డులకు గాను 3769 మంది నామినేషన్లు అర్హత సాధించినట్లు తెలపారు.

మొదటి విడుతలో 17 గ్రామ పంచాయతీల్లో సింగిల్ నామినేషన్ పత్రాలు వచ్చినట్లు వెల్లడించారు. మొద టి విడుత ఎన్నికలకు సంబంధించి ర్యాండమైజేషన్ పూర్తయినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, పోలీంగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరుగకుండా ముందస్తుగా పోలీసు భద్రతలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫొటోతో కూడిన ఓటరు స్ల్లిపులను అందజేస్తారని ఆయన వెల్లడించారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అధికారి పేరు, సెల్ నంబర్ అతికించడం జరుగుతుందని అన్నారు. 2019 జనవరి 1 వతేదీ వరకు 18 సంవ త్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకో వాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓపెన్ స్కూల్ తరగతులను కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. హాజరైన విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. ఈసందర్భంగా ఓపెన్ విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సాయాగౌడ్, తహసీల్దార్ లత ఉన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles