మహిళలకు ముగ్గుల పోటీలు

Mon,January 14, 2019 01:40 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ఎన్ కాలనీలో ఆదివారం శ్రీవరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సంక్రాంత్రి సంబురాలను ఘనంగా నిర్వహించారు. కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులకు పతంగుల పంపిణీ చేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారందరికీ జ్ఞాపికలు అందజేశారు. మొదటి బహుమతి కొండ వినీల, ద్వితీయ బహుమతి చిదుర సరిత, తృతీయ బహుమతి కొండ సుహాసిని గెలుపొందారు. పిల్లల విభాగంలో కొండ హాసిని, మౌనిక, మరుణ్ గెలుచుకున్నారు. కాలనీల వాసులు పాత రాజు సేట్, కోటి సంతోష్, కొండ శ్రీకాంత్, బెజుగాం మాణిక్యం, ప్రశాంత్, కృష్టమూర్తి, సుధాకర్, కిరన్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద: మండల కేంద్రంలో ఆదివారం భూమి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంత్రి సంబురాలను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. 40 మంది వరకు మహిళలు, బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. మీనా అన్నపూర్ణ, స్వాతి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పండుగ ప్రాముఖ్యతను సంప్రదాయాన్ని సంస్కృతి నేటి యువతరానికి తెలియజేయడానికి ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు భూమి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ హుండే బస్వరాజ్ తెలిపారు. తెలంగాణ తల్లి చిత్రాన్ని ముగ్గురూపంలో వేసిన నాలమ్ శీమాకు ప్రత్యేక బహుమతి అందజేశారు. అనంతరం బోగి మంటలు వేసి ఆటపాటలతో పండుగ జరుపుకున్నారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ ఉపాధ్యాయులు స్వరూప కులకర్ణి, వైజంతిమాల, పద్మ, స్వాతి, గిరిజ, స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ సమన్వయ కర్త రచ్చ శ్రీకాంత్, కార్యదర్శి గంగారాం పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles