భారీ మెజార్టీతో గెలిపించాలి

Mon,January 14, 2019 01:40 AM

-ఎమ్మెల్యే హన్మంత్ షిండే
పిట్లం: మండలంలో ఈనెల 25న జరుగనున్న స్థానిక సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికల్లో టీఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆయన ఆదివారం పిట్లం టీఆర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి జొన్న విజయలక్ష్మి, వార్డు సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో తనను గెలిపించిన మాదిరిగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. నియోజక వర్గంలో పిట్లం మండలానికి సాగునీరు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్లం మండల రైతులకు సాగునీరు అందించేందుకు రూ.476 కోట్లతో నాగమడుగు లిఫ్ట్ మంజూరు చేశారని, పిట్లం నుంచి బాన్సువాడ, చిన్నకొడప్ నుంచి కంగ్టి వరకు నూతనంగా డబుల్ రోడ్లు వేసిన ఘనత కేసీఆర్ దక్కిందన్నారు. మండల కేంద్రంలో నూతనంగా 50 పడకల దవాఖాన, డిగ్రీ కళాశాలను త్వరలో మంజూరు చేయిస్తానని అన్నారు. బుడగ జంగం కాలనీలో రూ.5 లక్షల నిధులతో కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పిట్లంలో నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డుకు ఇరువైపులా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ మండల అధ్యక్షుడు రమేశ్, టీఆర్ పట్టణ అధ్యక్షుడు బుడాల నవీన్, జడ్పీటీసీ ప్రతాప్ ఏఎంసీ చైర్మన్ వెంకట్ ఏఎంసీ మాజీ చైర్మన్లు లబాబుదొర, బాల్ వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, ఎంపీటీసీలు జగదీశ్, శోభా లక్ష్మణ్, స్థానిక సర్పంచ్ అభ్యర్థి జొన్న విజయలక్ష్మి శ్రీనివాస్ కోటారి ప్రభు, కరీం తదతరులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles