రెండోరోజు మరింత జోరు

Sun,January 13, 2019 01:29 AM

-కొనసాగిన నామినేషన్ల పర్వం
-192 సర్పంచులు, 1622 వార్డు స్థానాలకు ఎన్నికలు
-సర్పంచ్ స్థానానికి 253, వార్డు మెంబర్ 1,017 నామినేషన్
ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు రెండోరోజు నామినేషన్ పెరిగాయి. మొదటి రోజు కంటే ఎక్కువగా అభ్యర్థులు నామినేషన్ అధికారులకు సమర్పించారు. మొదటి రోజు సర్పంచు అభ్యర్థులకు 217 నామినేషన్ రాగా, రెండో రోజు 253 నామినేషన్ వచ్చాయి. వార్డు సభ్యుల కోసం మొదటి రోజు 466 మాత్రమే నామినేషన్ రాగా రెండో రోజు వాటి సంఖ్య విపరీతంగా పెరిగి 1,017కు చేరింది. శనివారం నాటికి 192 సర్పంచు స్థానాలకు గాను 470, 1,622 వార్డు స్థానాలకు గాను 1,483 నామినేషన్ అధికారులకు అందాయి. రెండో రోజు ఎల్లారెడ్డి మండలంలో 49 సర్పంచుకు, 154 మంది వార్డు సభ్యులకు, లింగంపేట మండలంలో 61 మంది సర్పంచుకు, 233 మంది వార్డు సభ్యులకు, నాగిరెడ్డి పేట మండలంలో 24 మంది సర్పంచుకు, 140 మంది వార్డు సభ్యులకు, గాంధారి మండలంలో 56 మంది సర్పంచు పదవులకు, 235 మంది వార్డు సభ్యులకు, నిజాంసాగర్ మండలంలో 37 మంది సర్పంచుకు, 116 మంది వార్డు సభ్యుల కోసం, పిట్లం మండలంలో 26 మంది సర్పంచు పదవుల కోసం, 139 మంది వార్డు సభ్యుల పదవుల కోసం తమ నామినేషన్ పత్రాలను ఆయా కేంద్రాల అధికారులకు అందచేశారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles