అలరించిన ముగ్గుల పోటీలు

Sun,January 13, 2019 01:28 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 108 మంది మహిళలు పాల్గొనగా విజేతలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. వెల్పేర్ అధ్యక్షుడు రాజన్న ఆధ్యక్షతన రోటరీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పిప్పిరి సుష్మ బహుమతులు అందజేశారు. ఈ పోటీలను బాంబేక్లాత్ హౌస్ యజమాని వీటీ లాల్ కుమారుడు హర్మ్ సౌజన్యంతో నిర్వహించారు. కోశాధికారి వెంకటేశం, శ్రీధర్, కుతుబుద్దీన్, మురళి, ఈశ్వర్ ప్రదీప్ న్యాయ నిర్ణేతలు విజయశ్రీ, శోభ, స్వప్న పాల్గొన్నారు.
పద్మశాలీ మహిళా సంఘం ఆధ్వర్యంలో..
విద్యానగర్: జిల్లా కేంద్రంలోని పద్మశాలీ సంఘం భవన్ పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బహుమతులు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు సిద్ది రాములు, పట్టణ అధ్యక్షుడు శేర్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ హరి, పడిగే రాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట్: స్థానిక శిశు మందిర్ పాఠశాలలో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పండరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles