వజ్ర సంకల్పంతో ముందుకు సాగాలి

Sun,January 13, 2019 01:28 AM

-కలెక్టర్ సత్యనారాయణ
-ఘనంగా స్వామి వివేకానంద జయంతి
విద్యానగర్ : యువత వజ్ర సంకల్పంతో ముందుకు సాగాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వివేకానంద వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకాంద పాఠశాల నుంచి సరస్వతీ శిశు మందిర్ వరకు నిర్వహించిన 2 కే రన్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శిశు మందిర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవితం సమస్తం సందేశం, ప్రేరణాత్మకమని అన్నారు. ఆయన ప్రభోధాలు దేశ ప్రజలను కార్మోన్ముఖులను చేశాయని, ప్రసంగాలు దేశ యువతనే కాకుండా పాశ్చాత్య దేశాలపై కూడా ప్రభావం చూపాయని అన్నారు. దేన్నైనా సాధించే శక్తి యువతకు ఉందని, దానికి కావలసింది వజ్ర సంకల్పమని అన్నారు. గమ్యం చేరే వరకు విశ్రమించవద్దన్న వివేకానందుడి స్ఫూర్తి వంతమైన మాటలు అనుసరణీయమని అన్నారు. ఎంత కాలం జీవించామని కాకుండా ఎంత ప్రభావితంగా జీవించామనేది ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ స్పోర్ట్స్ అధికారి దామోదర్ వివేకాంద వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పవన్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రంజిత్ మోహన్, సొసైటీ సభ్యులు వినయ్, అనీల్, పవన్, శ్రీధర్, రాజశేఖర్, సంతోష్, వేణు, కిశోర్, సోమశేఖర్, సంగారెడ్డి, సునీల్, రవి, సత్యనారాయణ, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles