అడవిపై గొడ్డలివేటు

Sat,January 12, 2019 01:46 AM

బాన్సువాడ రూరల్ : అటవీశాఖ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న అటవీప్రాంతంలో కబ్జాదారుల చేతిలో అడవులు నేలకొరుగుతున్నాయి. బాన్సువాడ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో మూడు నెలలుగా వేలాది చెట్లను నరికివేస్తూ సాగు భూములుగా మార్చుకుంటున్నా అటవీశాఖ అధికారులు కన్నెత్తిచూడలేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో నరికివేతకు గురైన అటవీ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ నెల 9న వచ్చిన రాష్ట్ర విజిలెన్స్ అధికారులు, జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారుల ఈ ప్రాంతాన్ని చూసి ఖంగుతిన్నారు. ఈనెల 10న పోలీసుల సహాయంతో కొయ్యగుట్ట గ్రామానికి వెళ్లి నలుగురు నిందులను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న మరో 40 మంది ఫరారయ్యారు.
మూడు నెలలుగా నేలకొరుగుతున్న చెట్లు
భావితరాలకు మేలు చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ర్టాన్ని హరిత తెలంగాణాగా తీర్చిదిద్దేందుకు హరితహారం పథకం ప్రవేశపెట్టి మొక్కలు నాటిస్తుంటే.. ఉన్న అడవులను కబ్బాదారులు యథేచ్చగా నరికివేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. డివిజన్ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొయ్యగుట్ట శివారు అటవీ ప్రాంతాన్ని సాగు భూములుగా మార్చేందుకు మూడు నెలలుగా 50 మంది నిత్యం చెట్లను నరికివేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 21 హెక్టార్లలో అడవిని నరికి వేశారు. అడవిలోని పెద్ద, పెద్ద వృక్షాలను నరికి కలపలను ఇటుక బట్టీలకు, సా మిల్లులకు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకున్నారు. నరికిన చెట్ల కొమ్మలు ఎండిపోగానే కాల్చివేస్తూ భూమిని చదును చేసుకున్నారు. అడవులు నేలకొరుగుతున్నా, అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై కొయ్యగుట్ట తండావాసులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles