మహా కూటమిని నమ్మి మోసపోవద్దు

Sun,October 21, 2018 01:12 AM

పిట్లం: ఇన్ని రోజులు కొట్లాడుకొని ఎన్నికలు రాగానే పదవుల కోసం అనైతిక పొత్తులు పెట్టుకున్న మహాకూటమిని నమ్మి మోసపోవద్దని జుక్కల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే అన్నారు. మండలంలోని బొల్లక్‌పల్లి, మద్దెల్‌చెరువు, బండపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాజా భజంత్రీలు, మంగళహారతులతో స్వాగతం పలికి తిలకం దిద్దారు. మద్దెల్‌చెరువు గ్రామంలో మత్స్యకారులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీలు 70 ఏండ్ల పాటు పాలించి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. వారి అసమర్థ పాలనతోనే జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా మారిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించిందన్నారు. అనేక నిదులు కేటాయించిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతోనూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారని అన్నారు. మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూ. 476 కోట్లతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఇక్కడి ప్రాంత రైతులు రుణపడి ఉంటారని అన్నారు. అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను వెయ్యి రూపాయలకు పెంచిన కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి ఐతే రూ. 3016 చేయనున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోఆరు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ఎంపీపీ రజినీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, జడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, ఎంపీటీసీ జగదీశ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి,నారాయణరెడ్డి,రవీందర్, శ్రీహరి, గోపాల్‌రావ్, సీతారామరావ్, విజయ్, మహిపాల్‌రెడ్డి, కరీం, నవీన్, లచ్చిరెడ్డి, గంగారెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్, పాండు, బాబూసింగ్, తుకరాం తదితరులు పాల్గొన్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles