సద్గుణాలు అలవర్చుకోవాలి


Sat,October 20, 2018 02:51 AM

పాత బాన్సువాడ : ప్రతిఒక్కరూ సద్గుణాలు అలవర్చుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సమేతంగా హాజరై మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని... ప్రతి ఒక్కరూ దుర్గుణాలను వీడి సద్గుణాలను అలవర్చు కోవాలని హితువు పలికారు. అనంతరం రిమోట్ ద్వారా రావణ దహనం చేశారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆర్యసమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాత్రి ఏడు గంటల వరకు కొనసాగిన వివిధ కార్యక్రమాలు అలరించాయి. పటాకుల శబ్ధంతో మినీ స్టేడియం ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమంలో మంత్రి సతీమణి పుష్పమ్మ, దేశాయిపేట్ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, నాయకులు శివకుమార్, చిన్న వెంకన్న, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ కొత్తకొండ నందిని, కొత్తకొండ భాస్కర్, బాబా, నార్ల రవీందర్, నాగులగామ వెంకన్న, దాసరి శ్రీనివాస్, ర్యాల మల్లారెడ్డి, జుబేర్, నార్ల ఉదయ్, పాత బాలకృష్ణ, బుల్లెట్ రాజు, హకీం, గడమల లింగం, మట్ట సాయిలు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...