అన్ని వివరాలు పొందుపర్చాలి


Sat,October 20, 2018 02:51 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఎన్నికల ప్రచురణలో భాగంగా కరపత్రాల ముద్రణలో తప్పని సరిగా ప్రింటర్, పబ్లిషర్ పేర్లతో పాటు అన్ని వివరాలు పొందుపర్చాలని జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని జనహిత సమావేశ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951/127/ఏ ప్రకారం కరపత్రాలలో ప్రింటర్ పబ్లిషర్ పూర్తి స్తాయీలో పేర్లను పొందుపర్చాలని, లేనిచో 127/ఏ(1) ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ముద్రణ కాపీల ఆర్డర్ సంఖ్య తెలియజేయాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు ఓటు హక్కుపై కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సమావేశంలో నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...