ఎన్నికల కోడ్ అమలెక్కడ ?

Sat,October 20, 2018 02:51 AM

ఎల్లారెడ్డి రూరల్ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న ఎల్లారెడ్డి పట్టణంలో మాత్రం కోడ్ అమలు అవుతున్న దాఖలు కనిపించడం లేదు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలతో కూడిన గోడప్రతులు మండల కేంద్రంలో పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆయా పార్టీలకు సంబంధించిన గోడప్రతులు తొలగించాలని స్పష్టమైన నిబంధనలున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల మ్యానిఫెస్టోకు సంబంధించిన గోడప్రతులను రహదారి వెంబడి, దుకాణాల సముదాయాలపై అతికించారు. ఎన్నికల కోడ్‌ననుసరించి పార్టీ గుర్తులను, వాల్‌పోస్టర్లను తొలగించాల్సిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో తొలగించలేదు. అక్కడక్కడ ఉన్న కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు సంబంధించిన గోడప్రతులు, స్వతంత్య్ర అభ్యర్థికి చెందిన గోడప్రతులు, విద్యుత్ స్థంబాలకు అక్కడక్కడా బీజేపీపార్టీకి చెందిన జెండాలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఇకనైనా అధికారులు స్పందించి ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles