ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

Wed,October 17, 2018 01:33 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతీ ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ప్రతినిధి చంద్ర భూషణ్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్, అమ్రాపాలితో కలిసి మంగళవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 12 నుంచి మొదలఅయ్యే అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా క్రిమినల్ కేసులకు సంబంధించి పూర్తి సమాచారం అఫిడవిట్ ఫారం -సి1లో పొందుపర్చి ఆ సమాచారాన్ని ఫారం-సి2 ద్వారా రికార్డు చేయాలని సూచించారు. ప్రముఖ దిన పత్రికల్లో వాటిపై ప్రచారం చేయాలని అన్నారు. ఇందుకు దిన పత్రికలు, టీవీ చానళ్లు, అభ్యర్థికి సంబంధించిన వైబ్‌సైట్‌లో పొందుపర్చాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ సమాచారాన్ని అందివ్వాలని, అఫిడవిట్‌లో తెలుపని వాటిపై ప్రచారం చేయొద్దన్నారు. నామినేషన్ పత్రాల్లో ప్రతీ కాలంను పూర్తి చేయాలని, తప్పుడు సమాచారం అందజేస్తే చట్టప్రకారం శిక్ష ఉంటుందని తెలిపారు.

అభ్యర్థి సమాచారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సందేహాలు ఉన్న వాటిపై కౌంటర్ అఫిడవిట్‌లో రిటర్నింగ్ అధికారి నోటీస్ బోర్డులో ప్రదర్శించాలన్నారు. ప్రచార ఖర్చును అభ్యర్థి ద్వారానే లెక్కించాలని అన్నారు. 2018 ఎన్నికల్లో గుర్తులను త్వరలో కేటాయిస్తామని తెలిపారు. త్వరలో కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో పర్యటిస్తుందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి తమ జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాలతో ఉన్న సరిహద్దులు, చెక్ పోస్టుల ఏర్పాటు, మద్యం సరఫరాపై నియంత్రణ చర్యలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా తీసుకున్న చర్యలు, అక్టోబర్ 12 నాటికి ఎలక్రోల్‌రోల్‌పై పెండింగ్‌లో ఉన్న అఫిడవిట్లు, వికలాంగులకు పోలింగ్ నాడు ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాలపై వివరించారు. 2014 ఎన్నికల్లో పెండింగ్‌లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, క్రిమినల్ విషయాలపై తీసుకున్న చర్యలు, ఎన్నికల విధులకు ఏర్పాటైన సిబ్బంది, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లపై సమీక్షిస్తామని తెలిపారు. ఓటరుకు తన పోలింగ్ కేంద్రాన్ని గుర్తించేందుకు ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వీసీలో కలెక్టర్ సత్యనారాయణ, ట్రైనీ ఐఏఎస్ వెంకటేశ్, ఆర్డీవోలు దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్, రాజేంద్రకుమార్, అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించాలి
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 22న పర్యటిస్తుందని, నోడల్ అధికారులు నిర్వహిస్తున్న విధులపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్లు అందించాలని అన్నారు. ఉద్యోగులు ఫాం-6 ద్వారా ఓటరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై రాజకీయ ప్రతినిధులు, ఏజంట్లతో సమీక్షించాలని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశానుసారం రిటర్నింగ్ అధికారి సి-1 ఫారం ద్వారా క్రిమినల్ విషయాలను, సి-2 ఫారం ద్వారా ప్రముఖ దిన పత్రికల్లో ప్రచురించాలని సూచించారు. వికలాంగుల ఓటింగ్ కోసం అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, సీపీవో శ్రీనివాస్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles