జిల్లాకు అదనంగా 25 వీవీ ప్యాట్లు

Tue,October 16, 2018 12:59 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాకు అదనంగా 25 వీవీ ప్యాట్ యంత్రాలు వచ్చాయని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గతంలో వచ్చిన వెయ్యి వీవీపాట్లలో 910 పని చేయగా, 90 డిఫెక్ట్‌గా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం వచ్చిన 25 యంత్రాలతో కలిపి మొత్తం 935 వీవీపాట్లు ఉన్నట్లు వివరించారు. వీటిని జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ గోదాంలో భద్రపరిచి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎన్నికల సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బాల్‌రాజ్, ఖాసీం అలీ, మోతీరాం, సురేశ్, సంతోష్, పాల్గొన్నారు.

131
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles