సరస్వతీ మాతకు మంత్రి, జడ్జి దంపతుల పూజలు

Tue,October 16, 2018 12:59 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ: బాన్సువాడలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం దంపతులు, మున్సిఫ్ కోర్టు జడ్జి శ్రీనివాస్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు ధర్మకర్త పరిగె శంభురెడ్డి దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సభ్యుడు నాగులగామ వెంకన్న, సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

133
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles