ఈవీఎంలపై అపోహ వద్దు

Mon,October 15, 2018 12:48 AM

కామారెడ్డిరూరల్ : ఓటు వేసేందుకు ఉపయోగించే యంత్రాలపై ఎలాంటి అపోహ పెట్టుకోవద్దని కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం బీఎల్వోలకు ఈవీఎం, వీవీ ప్యాట్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మనం వేసిన ఓటు వేరే గుర్తులకు పడదని, ఏ గుర్తుకు పడిందో తెలుసుకోవచ్చన్నారు. వీవీపాట్‌లో 7 సెకన్లపాటు మనం వేసిన పార్టీ గుర్తు కనిపిస్తుందని తెలిపారు. నవంబర్ 9 వరకు 18 సం వత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ఇందుకోసం తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. దీనిపై ప్రచారం చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలు, సందేహాలపై నిపుణుడు రాజేశ్ వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, బీఎల్వోలు పాల్గొన్నారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles